5, ఆగస్టు 2012, ఆదివారం

అమ్మ

అమ్మ 


ఓ  నేస్తమా !

నీవు  లోకంలో అడుగు పేట్టగానే

నిన్ను పలకరించే నేస్తం  అమ్మ

నీ ఆలనాపాలనా చూసేది అమ్మ 

ఆనందమైనా  దుఖామైనా మొట్టమొదటిగా 

వ్యక్తం చేసేది అమ్మతోనే   

అలాటి నేస్తనికి, మాతృమూర్తికి వందనం

 

 చూపు

అవును 

తూనీగను  చూసి 

కేరింతలు కొడుతున్నారు

పసిపిల్లలు

మనకు  తూనీగే కనబడుతోంది

వారికో? 

రెక్కలఫై చక్కని  ఇంద్రధనుస్సులు! 




 

 అన్నిటినీ  మించిన అందం

 

పరికించు 

ప్రకృతిలో  ప్రతిది అందనమైనదే    

సమయ సందర్భాల్లో 

అందాలు విందు చేస్తాయి 

కనువిందు చేస్తాయి

 

అందం మనలోనే

చిందుతూవుంటుంది

 

మనసా

నిజానికి

నిన్ను మించిన అందం ఎక్కడుoటుoది 

కామెంట్‌లు లేవు: