1, మార్చి 2013, శుక్రవారం

7, ఫిబ్రవరి 2013, గురువారం

ముత్యాలు 


'అల' జడులు

నీలో ఎన్నో 

అలోచనలు!

నాలో  మరెన్నో

నీలో  తుఫానులు 

నాలోనూ

 

నీ  పొత్తిటలో 

ఎన్నో  ముత్యాలు

నాలో  సుగుణాల్లా !

17, జనవరి 2013, గురువారం

 నవ్వునేనై   నేనునువై

నువ్వెప్పు డూ  నాలోనే

కారు మబ్బుల్లా కమ్ముకొచ్చిన

చీకటిదారుల్లో  నైనా

నైరశ్యాల్ని చీల్చుకొచ్చిన

మెరిసే  వెన్నల  వేలుతురులోనైనా

నాలోలోపలికి  ప్రకాశంగా 

ప్రవహిస్తూ నవ్వు  నేనై 

నేను  నువై

 

 


నేననే  చీకటి దేహం చుట్టూ

జ్ఞాపకాల  వెలుతురుపూల హారంలా  నువ్వు

నీ  మాటలు మధురామృతం 

గ్రోలి  నేను

మరణహాలాహలాన్ని సైతం

అలవోకగా  హరించుకోగలనుకదా

నేస్తమా 

నీ  జ్ఞాపకం

అనుక్షణం  చిరంజీవి  కదా!

 

4, డిసెంబర్ 2012, మంగళవారం

 నన్ను  విడిచిన


రేకులు  విచ్చిన

వజ్రాని నీవు

శాంతి కాంతితో

నీవు  ఎల్లప్ప్పుడూ

నాలో 

విలీనమయ్య వుంటావు

నన్ను  విడిచిన  రోజున

నీవిలువ  తెలియ లేదు 

నీవు లేవనే

భాధకన్నా

నా కోసం

మరల పుడతావనే

సంతోషమే  మిన్న

కనపడిని క్షణాలు

కనపడని క్షణాల్లో  గుర్తువస్తున్నాయి 


9, నవంబర్ 2012, శుక్రవారం

అనుకోని ........

అనుకోని ........

అనుకోలేదె  ప్పు డూ 

ఈ మాట

నా నోట

సంగీతమై  ప్రవహిస్తుందని

భావించ  లేదెప్పుడూ 

నా  అంతరంతరాల్లో  చేరి

అనుభూతి  తరంగాల్ని

ప్రవహిస్తుందని

తోచలేదెప్పుడూ

నీ పలుకుల

తేనె ఊటల్ని

రుచించక  ముందు

జీవితముందని 

8, నవంబర్ 2012, గురువారం

అన్నీ కొత్తే

అన్నీ కొత్తే 

కొత్త రుచులు

కొత్త అందాలు

కొత్త ఆలోచనలు 

ఆలస్యం

 

ఇక్కడ

విషం కాదు

కొత్త అమృతం

దరి

రెప్పపాటు  జీవితం

పగిలిపోతుంది నీటి బుడగలా

కష్టాల కడలిలో

కదులుతోంది భారంగా నావ

అప్పుడుకటి ............. అప్పుడుకటి

అత్మీయానందాల అలలల్లరి

 

ఏముందయినా

కలలతో కబుర్లాడుతూ

జీవితాన్నీద వలిసిందే

ఆ  దరికి  చేరవల్సిందే!  


19, అక్టోబర్ 2012, శుక్రవారం

అపురూపం

ఎంత  అపురూపం

నీ శిరస్సుఫై కిరీటం!

 

నీ  సోయగం

నీ  నృత్యం

అబ్బురపరిచేవి.......

 

నీ  నాట్యానికి

ఆకాశంలో

హరివిల్లే

నాట్యమాడుతోంది

నీ  నాట్యానికి

పులకించి.......

 

మగువలే

నీ నడక హొయలకు

అసూయలు

ప్రదర్శిస్తున్నారు........

 

పసిడి, నీలిమబ్బు, ఆకుపచ్చ

నీ మీద  మనసు పడి

శాశ్వతంగా  నీలో లీనమైనట్లు

ఎన్ని కాంతుల జల్లులు

నీ అందాలకు దాసోహం   


18, అక్టోబర్ 2012, గురువారం

కోకిలా..చిలుకా..గోరింకా


కోకిలా

నీ గానం మధురం

మధురాతి మధురం 

నీ రూపం

కాదు  ముఖ్యం

నీ మనసు

ముఖ్యం


చిలుకా

కఠీనాత్మునినైనా

అమృతమూర్తిగా 

మారుస్తాయి

నీ పలుకులు


గోరింకా 

హరివిల్లు

తలపించే  దానా 

ఇంకా  ఇంకా

చుడాలనిపించేస్తుంది

నిన్ను 



ఆకృతులు గావు

రూపురేఖలు గావు

గుణగుణాలు

ముఖ్యం 

అన్నిటికనా