30, ఆగస్టు 2012, గురువారం

చీరా

చీరా 

 

నిన్ను చూసిన క్షణాన 

మైమరచిపోతాను   


 

నీలో ఎన్నో అందాలు 

మరి ఎన్నో హొయలు!


 

నిన్ను ధరించిన్న క్షణాన

ఈ  లోకమే గర్విస్తుంది

గౌరవంగా  చేతులు  ఎత్తి

నమస్కరిస్తారు  అందరూ


 

స్త్రీ  గౌరవాన్ని  పెంపొందిస్తావు 

నీలో  సద్గుణాలు

కనబరుస్తుంది 

అదే నీ గొప్పతనం   

ఓ  చీరా!




 నీ  మువ్వల్లో 

 



నీ సవ్వడి 

గలగాల పారే  గోదారిలా 

ఎంత మధురం 


 

అది  మధుర సంగీతం 

ఎంత హాయి!


 

పసివాళ్ళు 

ముసలి వాళ్ళు 

నీ వినికిడికి 

పులకిస్తారు 

ఇదంతా 

గలగలల మువ్వల్లో  




వెచ్చని  స్పర్శ

 

సుతిమెత్తని  చలిలో 

నులి వేచ్చని నీ స్పర్శ 

ఎంత ఉపశమనమోకదా!

 

పెదవుల్ని ముద్దాడుతూ 

మెల్లగా మనసులోకి 

జారిపోయే మధురమైన 

ప్రేమామృత ధారవే కదా !

 

నిన్ను రుచించగానే

మెదడు కొత్త  ఆలోచనలు 

వెల్లువవుతుంది !

 

ఎపుడైనా, ఏక్కడైనా, ఎవరికయనా  

నేనున్నానంటూ భరోసా ఇస్తుంటావు

నువ్వు లేకుండా పొద్దుగడవదు

అప్పుడఅప్పుడు నువ్వు 

కడుపులోపలి వణుకుకు 

చలి మంటవవుతుంటావు           

 



కామెంట్‌లు లేవు: