1, అక్టోబర్ 2012, సోమవారం

నా భాష

నా  భాష 

ప్రకాశించే  ఆత్మీయత

మన భాషలోనే!

పాలిచ్చి లాలించగా...

అమ్మ తనంలో

పాల తీయదనం!

 

పెంచి పోషించగా.....

అయ్యా! అనడంలో

భరోసాతో  నిలబడటం

 

పాలమీగడల లాలనకు

'అత్తా' పిలుపులో

మెత్తదనపు మొత్తం

 

చిన్నతనానికి  క్రమశిక్షణ

క్రమక్రమంగా  అలవరచినప్పుడు

రెండో  అమ్మగా

అక్కా! అని చక్కగా

సంబోధించడం

 

నాన్న  పాత్రతో

అన్నీ నేనే అనే వ్యక్తిని

'అన్నా' అనడంలో, పెద్దరికంలో

ఓ  వెన్నతనం  అన్నతనం

 

పిలవడంలోనే

నా భాషలో......

కుటుంబం లోని

కొన్ని పాత్రలకు

ప్రారంభోత్సవాలు

"అ" తోనే  మరి!

నా  భాషతోనే మరి! 

 

  

కామెంట్‌లు లేవు: